Home Page SliderInternational

వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠీ పెళ్లి సందడి.. ఫొటోలు వైరల్

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రేపు 1-11-23న వీరి వివాహం ఇటలీలో జరగనుంది. ఈ వేడుకలో భాగంగా అక్టోబర్ 30న కాక్‌టేల్ పార్టీ చేసుకున్నారు. ఇందులో లావణ్య త్రిపాఠీ వైట్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే సోషల్ మీడియాలో అభిమానులు హ్యాష్ ట్యాగ్‌తో ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఇక ఈ పార్టీలో రామ్‌చరణ్ – ఉపాసన, అల్లు అర్జున్-స్నేహాలు కూడా కలర్‌ఫుల్‌గా తయారయ్యారు. ఇప్పటికే పెళ్లి వేడుక కోసం మెగా, అల్లు కుటుంబాలు ఇటలీ చేరుకున్నాయి. నేడు హల్దీ, మెహందీ వేడుకలు ఉంటాయి. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.