వ్యానిటీ వ్యాన్‌లలో ‘మేల్స్‌కు ఫిమేల్సే’ టార్గెట్
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, నటి రాధిక శరత్‌కుమార్ వ్యానిటీ వ్యాన్‌లలో ‘మేల్స్‌కు ఫిమేల్సే’ టార్గెట్ అని పేర్కొన్నారు. వ్యానిటీ వ్యాన్‌లో రహస్యంగా కెమెరాతో రికార్డ్ చేసిన మహిళా నటి న్యూడ్ వీడియోను చూసి నవ్వుకుంటున్న కొందరిని చూసినప్పుడు జరిగిన సంఘటన గురించి మాట్లాడారు. రాధికా శరత్‌కుమార్ మహిళా నటీనటులకు పనిచేసే చోట భద్రత గురించి ప్రశ్నించారు. ఆమె ఒక మహిళ వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తులను సెట్స్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చెప్పింది. ప్రైవసీని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళకు ఎందుకు ఉండకూడదని రాధిక గట్టిగా క్వశ్చన్ చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసులపై నటి రాధిక శరత్‌కుమార్ వ్యాఖ్యానిస్తూ, ఇతర చిత్ర పరిశ్రమలలో కూడా ఇటువంటి సంఘటనలు ఎక్కువగానే ఉన్నాయని హైలైట్ చేసింది. ఆమె ఒక వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ, ఫిల్మ్ సెట్‌లో ఒక మహిళా నటి న్యూడ్ వీడియోను చూస్తున్న పురుషుల గుంపును చూసిన సంఘటనను ఆమె తన వ్యానిటీ వ్యాన్‌లోని రహస్య కెమెరాతో రికార్డ్ చేసిన సంఘటనను బయటకు వెళ్లగక్కింది. ఆమె గట్స్‌కు హేట్సాఫ్ చెప్పక తప్పదు.
తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో పనిచేసిన రాధిక.. కలకలం రేపిన ఈ ఘటన గురించి ఒక న్యూస్ ఛానల్‌తో మాట్లాడారు. “నేను కేరళలో ఒక సెట్‌లో ఉన్నప్పుడు, ప్రజలు ఒకచోట గుమిగూడి ఏదో చూసి నవ్వడం చూశాను. నేను వెళుతుండగా, వారు వీడియో చూడటం గమనించాను. నేను ఆ సిబ్బందిని పిలిచి, వారు ఏమి చూస్తున్నారు అని అడిగాను. వ్యానిటీ వ్యాన్‌లలో కెమెరాలు ఉన్నాయని, మహిళలు బట్టలు మార్చుకునే ఫుటేజీని తీయడం జరిగింది, మీరు ఆర్టిస్ట్ పేరును టైప్ చేయండి, వారు దుస్తులు మార్చుకునే వీడియో మీకు కనిపిస్తుంది. మేము పైకి చూస్తూ ఉమ్మి వేస్తే, అది మన ముఖం మీదే పడుతుంది. కాబట్టి నేను పేర్లు చెప్పనక్కర్లేదు”. అని పేర్కొన్నారు.
” ఆ ఘటన తర్వాత వ్యానిటీ వ్యాన్‌లను ఉపయోగించడానికి భయపడ్డాను. హోటల్ గదిలోనే బట్టలు మార్చుకోవడానికి ఉపయోగించడం ప్రారంభించాను. ఈసంఘటన తర్వాత నేను ఇతర మహిళా కళాకారులకు రహస్య కెమెరాల గురించి చెప్పాను. దీనితో వారు కూడా జాగ్రత్త పడడం ప్రారంభించారు. వాహనంలో కెమెరా కనిపిస్తే వారిని చప్పల్స్ (చెప్పులతో) కొడతానని వ్యాన్‌లో ఉన్న బృందానికి చెప్పాను. నేను సురక్షితంగా ఉండాలని కోరుకున్నాను” అని పేర్కొన్నారు.

జస్టిస్ హేమ కమిటీ రిలీజ్ చేయడంలో జాప్యాన్ని కూడా నటి ప్రశ్నించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసుల్లో ప్రమేయం ఉన్న పలువురి పేర్లను బహిర్గతం చేసిన తుది నివేదికను 2019లో కేరళ ప్రభుత్వానికి సమర్పించారు. అయితే, ప్రభుత్వం ఇటీవలి వరకు దానిని సీక్రెట్ గానే ఉంచింది.
ఇది దాదాపు పని చేసే ప్రతి మహిళపై ప్రభావం చూపుతోందని అన్నారు. పరిశ్రమలో ఈ నేరస్థులను గరించి బయటకు చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఆమె ప్రశ్నిస్తూ, “న్యాయమూర్తి హేమ కమిటీ నివేదిక విడుదలలో ఇంత జాప్యం ఎందుకు జరిగిందో అని నేను ఆశ్చర్యపోతున్నాను. నేను పరిశ్రమలో 46 ఏళ్లుగా ఉన్నాను. నాతో అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించిన వ్యక్తులు ఉన్నారు, ఇది సమిష్టి బాధ్యత అన్నదే స్త్రీ, పురుషులు గమనించాలి.