కశ్మీర్‌కు ‘వందే భారత్’
ఎన్నాళ్లుగానో టూరిస్టులు ఎదురుచూస్తున్న కశ్మీర్‌కు వందే భారత్ రైలు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ పడింది. ప్రధాని మోదీ ఈ నెల 17న శ్రీనగర్‌కు వెళ్లే వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. శ్రీనగర్‌కు నడిచే రైలు కాట్రా నుండి బయలుదేరుతుంది. ఈ రైలు ఇతర వందే భారత్ రైళ్ల కంటే విభిన్నంగా ఉంటుంది. కశ్మీర్ వాతావరణానికి తగినట్లు మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా సమస్యలు లేకుండా ప్రయాణించగలదు. కొంతకాలం తర్వాత దీనిని జమ్మూ వరకూ పొడిగిస్తారు. ఇది కాట్రా నుండి శ్రీనగర్‌కు మూడు గంటలలో చేరుకుంటుంది. ఏసీ చైర్ కార్ ఛార్జీ రూ. 1700 వరకూ, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ రూ. 2600 వరకూ ఉండొచ్చు. ఫిబ్రవరి17న రైలు ప్రారంభించిన అనంతరం రైలు ఛార్జీలు ప్రకటిస్తారు.

