Andhra PradeshHome Page Slider

“వందే భారత్ ఎక్స్‌ప్రెస్..వెల్‌కమ్ టు గుంటూర్”

ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించారు. అయితే ఈ ట్రైన్ స్టాప్స్‌లో గుంటూరు కూడా ఉంది. దీంతో వందేభారత్ ఎక్‌ప్రెస్ గుంటూరుకు చేరుకుంది. దీంతో గుంటూరు రైల్వే స్టేషన్లో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కు రాజ్య సభ సభ్యులు శ్రీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం సహకారంతో సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రావటం చాలా సంతోషంగా ఉందన్నారు.

కాగా శనివారం ఉదయం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ శనివారం సాయంత్రం గుంటూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంది. ఈ సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు స్వాగత కార్యక్రమంలో ఎమ్మెల్సీలు శ్రీ మురుగుడు హనుమంతరావు గారు, శ్రీ మర్రి రాజశేఖర్ గారు, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫిజ్ గారు, గుంటూరు నగర  మేయర్ శ్రీ కావటి మనోహర్ నాయుడు గారు, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా గారు, పొన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కిలారి వెంకట రోశయ్య గారు, గుంటూరు రైల్వే డిఆర్ఎం గారు, డిప్యూటీ మేయర్ శ్రీమతి షేక్ సజీల గారు, పలువురు బీజేపీ శ్రేణులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో ఎంపీ అయోధ్య రామిరెడ్డి గారు మాట్లాడుతూ..భారత దేశం ప్రపంచ దేశంలోనే గొప్పగా అధునాతన టెక్నాలజీతో ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా గుంటూరు వాసులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఘన స్వాగతం పలికారు.