వంశీకి మరోసారి రిమాండ్ పొడిగింపు..
వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది కోర్టు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ రిమాండ్ నేటితో ముగియనుండడంతో ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం మరోసారి ఆయన రిమాండ్‌ను ఏప్రిల్ 8 వరకూ పొడిగించారు. మరోపక్క ఆయన బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పును రిజర్వు చేసింది. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

