వల్లభనేని వంశీకి తీవ్ర అస్వస్థత..కుటుంబ సభ్యుల ఆందోళన
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి తీవ్ర అస్వస్థత రావడంతో జీజీహెచ్‌కు తరలించారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనితో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంకిపాడు పోలీస్ స్టేషన్ నుండి ఆయనను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన మాజీ మంత్ర పేర్ని నాని ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడారు. వంశీ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆసుపత్రి వద్ద వంశీ చికిత్స నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

