వల్లభనేని అరెస్ట్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆయన్ను బుధవారం రాత్రి హైద్రాబాద్‌లో ఏపి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అక్కడ నుంచి ఏపికి తరలిస్తున్నారు. గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి కేసులో ఆయన ప్రధాన నిందితుడుగా ఉన్నారు.అంతే కాదు సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే ఫిర్యాదు మేరకు ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు.మొత్తం 7 సెక్షన్ల కింద వంశీపై విజయవాడలోని పటమట పోలీసులు అరెస్ట్ చేశారు.వంశీని పోలీసులు విజయవాడకు తరలించారు.