దసరాకు సిద్ధమౌతున్న ‘వేట్టైయాన్’
రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వేట్టైయాన్‘. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ డైరెక్షన్‌లో రాబోతోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషిస్తున్నారు. చిత్రీకరణ కంప్లీట్ అయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు చేపట్టారు. దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలకు సిద్ధమౌతోందన్నట్లు ఫిల్మ్ మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు టీజే జ్ఞానవేల్ గత చిత్రాల తరహాలోనే చక్కటి సామాజిక సందేశం ఇవ్వబోతున్న కథాంశమిదని, ఇందులో రజనీకాంత్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపిస్తారని, దుష్టశిక్షణ కోసం ఆయన ఏం చేశారన్నది ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికాసింగ్, దుషరా విజయన్, రోహిణి మొదలైనవారు నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్, నిర్మాత: సుభాస్కరన్.