500 గ్యాస్ పంపిణీ విధివిధానాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి కసరత్తు
సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావ్, సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. త్వరలో మహాలక్మి పథకం కింద 500 రూపాయలకు వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చే అంశంపై చర్చించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ, రేషన్ లబ్దిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా అంశాన్ని మంత్రి చర్చించారు.