BusinessInternationalNews AlertTrending Todayviral

ఇంటర్నెట్ లేకుండానే ఏఐ వినియోగం…గూగుల్ సరికొత్త ఆవిష్కరణ..

ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ సంస్థ సరికొత్తగా ఇంటర్నెట్ లేకుండానే ఏఐ వినియోగించే సరికొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. దానిపేరు ఏఐ ఎడ్జ్ గ్యాలరీ. దీని ద్వారా శక్తివంతమైన ఏఐ మోడల్స్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా రన్ చేయవచ్చు. ఇందులో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే.. యూజర్ ప్రైవసీకి ముప్పు చాలా తక్కువ. ఎందుకంటే యూజర్లు అందించే డేటా క్లౌడ్ సర్వర్లకు వెళ్లకుండా మొత్తం ఫోన్లోనే రన్ అవుతుంది. ఇది సెక్యూరిటీ ముప్పును తగ్గిస్తుంది. అలాగే పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. సర్వర్ కోసం వేచిచూసే పనిలేకుండా యూజర్ల అడిగే ప్రశ్నలకు నేరుగా స్పందించేందుకు ఏఐకి ఆస్కారం కలుగుతుంది. ప్రస్తుతానికి ఈ యాప్ “ప్రయోగాత్మక ఆల్ఫా విడుదల” గా గూగుల్ పేర్కొంటున్నప్పటికీ, అపాచీ 2.0 లైసెన్స్ కింద పూర్తిగా ఓపెన్ సోర్స్ ఈ యాప్ అందుబాటులో ఉంది. అంటే డెవలపర్లు, కంపెనీలు దీనిని ఉపయోగించవచ్చు. మార్పులు చేయవచ్చు. వాణిజ్య ఉత్పత్తులలో జోడించవచ్చు. కాగా గూగుల్ ఏఐ ఎడ్జ్ గ్యాలరీ యాప్ ఐఓఎస్ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం.