కుప్పకూలిన US స్టాక్ మార్కెట్లు -ప్రపంచ కుబేరుల సంపద ఆవిరి
US స్టాక్ మార్కెట్‌లో నిన్న ఒక్కరోజులో పెద్ద సునామీ కనిపించింది. స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. ఇండెక్స్‌లన్నీ బాగా పడిపోయాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వారి సంపద భారీగా కరిగిపోయింది.
మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్‌గేట్స్ సంపద 2.8 బిలియన్ డాలర్లు అంటే 22 వేలకోట్లు కరిగిపోయింది.
వారెన్ బఫెట్ సంపద 3.4 బిలియన్ డాలర్లు (27,000 కోట్లు)
జెఫ్ బెజోస్ సంపద అత్యధికంగా 9.8 బిలియన్ డాలర్లు (80,000 కోట్లు)
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద 8.4 బిలియన్ డాలర్లు (70,000 కోట్లు)
బ్లూమ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రపంచంలోనే ధనవంతుల సంపదను ట్రాక్ చేస్తూ ఉంటుంది. ప్రతీ ట్రేడింగ్ డే రోజున ఈ వివరాలు అప్‌డేట్ అవుతూ ఉంటాయి. ఆ డేటా ప్రకారం మొదటి స్థానంలో ఎలాన్ మస్క్, రెండోస్థానంలో జెఫ్ బెజోస్ ఉన్నారు. తొలి 10 స్థానాల్లో భారతదేశానికి చెందిన అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఉన్నారు.

