అమెరికాలో ఆరేళ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సిన్
కోవిడ్ వ్యాక్సిన్ల విషయంలో అమెరికా అసాధారణ నిర్ణయం తీసుకొంది. ఇకపై 6 నెలల పైబడిన వారికి సైతం వ్యాక్సిన్ వేసేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి AFP మీడియా వార్తను ప్రచురించింది. కరోనాతో రెండేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అమెరికా వ్యాక్సిన్ల విషయంలో మొదట్నుంచి కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తినా… స్థానిక ప్రజలను రక్షించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. చిన్నారులకు మెడర్నా, ఫైజర్ వ్యాక్సిన్లు ఇవ్వొచ్చని… అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది.

