Breaking NewscrimeHome Page SliderNewsTelangana

ఫోన్ వాడొద్దన్నందుకు ఉరేసుకుని….

రంగారెడ్డి జిల్లా మియాపూర్ లోని న్యూ హాఫిజ్‌పేటలో విషాదం చోటు చేసుకుంది. మార్తాండ నగర్‌లో ఉండే బల్వంత్ సింగ్ అనే వ్య‌క్తి త‌న కొడుకు శౌర్య సింగ్ ని (17) ఫోన్ విష‌యంలో వారించాడు. స‌మీపంలోని ఓపెన్ స్కూల్లో పదోవ తరగతి చదువుతున్నాడు.కొద్ది రోజుల్లో ప‌రీక్ష‌లు ఉండ‌టంతో …ఎప్పుడూ మొబైల్ చూడ‌ట‌మేనా చ‌దివేది ఏమైనా ఉందా అంటూ గదిమాడు.త‌ల్లి కూడా రెండు రోజుల కింద‌ట‌…అధికంగా ఫోన్ చూస్తున్నావ‌ని మంద‌లించింది.దీంతో మ‌న‌స్తాపానికి గురైన శౌర్య‌సింగ్‌…చున్నీతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.ఉద‌యం లేచి చూసే స‌రికి కొడుకు ఫ్యాన్‌కి వేలాడుతూ క‌నిపించే స‌రికి త‌ల్లిదండ్రులు దుఖంతో కుమిలిపోయారు.పిల్ల‌ల‌కు చిన్న నాటి నుంచే ఫోన్లు అల‌వాటు చేసి ముద్దు మురిపెంగా చూసుకుంటూ…ఇలా గాడి త‌ప్పాక శ‌వంగా చూసుకోవాల్సిన దుస్థితి దాపురించే స‌రికి త‌ల్ల‌డిల్లి పోతున్నారు.