పేటీఎంలో ఉప్పల్ టీ20 టిక్కెట్లు
ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. అందులో భాగంగా అక్టోబర్ 12న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే మూడో టీ20 మ్యాచ్ కోసం ఇవాల్టి నుంచి మ్యాచ్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. పేటీఎం ఇన్ సైడర్ వెబ్ సైట్, యాప్ ద్వారా ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవచ్చని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. ఈ మ్యాచ్ కనీస టికెట్ ధర రూ. 750గా నిర్ణయించారు. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకున్నవారు ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు జింఖానా స్టేడియంలో ఫిజికల్ టికెట్లు తీసుకోవల్సి ఉంటుందన్నారు. ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు ఐడీ ప్రూఫ్ చూపించి, ఆన్ లైన్ బుకింగ్ ప్రింట్ చూపిస్తే టికెట్లు ఇస్తామని వెల్లడించారు. టికెట్లు బయట కౌంటర్లలో అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు.

