యూనివర్సిటీ పరీక్షల వాయిదా
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలోని పరీక్షలను వాయిదా వేసినట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. తెలంగాణలో మూడు రోజుల పాటు వాతావరణ శాఖ ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించింది. భారీ నుండి, అతిభారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనితో విద్యార్థులకు పరీక్షలకు హాజరవడానికి ఇబ్బందిగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. పరీక్షల రీషెడ్యూల్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.