Home Page SliderTelangana

తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కోసం సమైక్య పోరాటం

తెలంగాణలో సమయం ఆసన్నమైందని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోరాటం చేస్తామని రాష్ట్రంలోని బీసీ కులాలన్నీ నినదీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి చేసేందుకు బీసీ వర్గాలన్నీ కూడా కలసి పయనించాలని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ జరిగిన కార్యక్రమంలో పలువురు మేధావులు పిలుపునిచ్చారు. గుర్రంపోడు భూ పరిరక్షణ సమితి అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది ఇస్లావత్ బాలాజీ నాయక్ అధ్యక్షతన జరిగిన ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ,కుల సంఘాల ఆధ్వర్యంలో జనాభాలో అధిక శాతం బీసీలు ఉన్నారు కాబట్టి బీసీలు ,ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గాలు మద్దతుగా నిలవాలని ఎవరి వాటా ప్రకారం ,వాళ్లకు ప్రాతినిధ్యం ఉండాలని చట్టసభలలో బీసీ, ఎస్సీ , ఎస్టీలకు ప్రాతినిధ్యం ఉండాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ,కలలుగన్న రాజ్యాధికారం ఈ వర్గాలు సాధించాలని దీనిపై చర్చా వేదిక నిర్వహించడం జరిగింది. ఈ చర్చా వేదికలో తెలంగాణ బి.సి.సిడబ్ల్యుసి చైర్మన్ తెలంగాణ విఠలన్న మాట్లాడుతూ …అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ ,బీసీలు అధికారం దిశగా ప్రయాణించాలని గాంధీభవన్ల చుట్టూ ,ఢిల్లీ చుట్టూ ,శ్యాం ప్రకాష్ ముఖర్జీ భవనం చుట్టూ ,తెలంగాణ భవన్ చుట్టూ టికెట్ల కోసం తిరుగుతున్న మా ఎస్సీ ,ఎస్టీ, బీసీ సోదరులకు ఈ వేదిక నుంచి పిలుపునిస్తున్నాం. మన వాటా మనం నిర్ణయించుకుందాం. అత్యధిక ఓట్లు ఉన్న మనం వాళ్ల చుట్టూ తిరిగి అగ్రవర్ణాలను రాజులను చేయడమే తప్ప మన వర్గాలకు జరిగే మేలు ఏమీ లేదు ,కావున సమయం వృధా చేయకుండా రాబోయే కాలంలో ఒక ఐదు నుంచి పది లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేద్దామని దానికి ఒక జేఏసీని త్వరలో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది.

కార్యక్రమంలో సభ నిర్వహణ అధ్యక్షులు ఇస్లావత్ బాలాజీ నాయక్ మాట్లాడుతూ ..రాష్ట్రంలో లంబాడీల జనాభా దాదాపుగా 40 నుండి 50 లక్షలు మంది ఉన్నారని మేము బీసీ ముఖ్యమంత్రి కోసం మా వర్గాలను ఏకం చేస్తామని ఈ కార్యక్రమంలో లంబాడి నాయకులు ,ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ గారు ,లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసు రామ్ నాయక్ గారు ,వాళ్ల ఆధ్వర్యంలో కార్యచరణను నిర్వహిస్తామని లంబాడి నాయకులు పిలుపునిచ్చారు . అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కొంతమంది ఎమ్మార్పీఎస్ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొని మేము కూడా బీసీ ముఖ్యమంత్రి కోసం పాటుపడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ శక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్ సేవా సమితి నాయకులు పిట్ల నగేష్ ముదిరాజ్ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన ముదిరాజులను కెసిఆర్ గవర్నమెంట్ ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం ఆ సామాజిక వర్గానికి అవమానకరమని ,ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ఏకం చేసి బీసీ ముఖ్యమంత్రికై మా పాత్ర మేము పోషిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన నాగుల శ్రీనివాస్ యాదవ్ ,యాదవ్ సామాజిక వర్గాన్ని ఏకం చేసి బీసీ ముఖ్యమంత్రి సాధన ఏకైక లక్ష్యంగా పనిచేస్తానని చెప్పారు. గౌడ సామాజిక వర్గానికి చెందిన వంగ రాములు గౌడ్, బీసీ ఫోరం ఆధ్వర్యంలో అందర్నీ ఏకం చేస్తానని హామీ ఇచ్చారు. బీసీ సమాజ్ నుండి సింగం సూర్యారావు మాట్లాడుతూ బీసీ ముఖ్యమంత్రి సాధన సమితికై బీసీలలో ఉన్న సంచార జాతి కులాలను కూడా ఏకం చేస్తానని ఇప్పటికే తమ ప్రణాళిక ప్రారంభించామని తప్పకుండా బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా ప్రయాణిస్తామని ఇచ్చారు. ఓయూ జేఏసీ నాయకులు ముదిరాజ్ విద్యార్థి సంఘం నాయకుడు ఆంజనేయులు ముదిరాజ్ మాట్లాడుతూ ఈ ఉద్యమంలో విద్యార్థి లోకాన్ని ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రాతినిధ్యం వహిస్తానని అన్నారు. అదేవిధంగా బీసీలలో ఉన్న అన్ని సామాజిక వర్గానికి చెందిన నాయకులు పాల్గొని తమ తమ సామాజిక వర్గాన్ని బీసీ ముఖ్యమంత్రి సాధనకై నడుము బిగిస్తామని ,ఇప్పటినుండి అన్ని వర్గాలను కలిపి బీసీ ముఖ్యమంత్రి సాధనగా ముందుకు నడవాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సహకారంతో బీసీ ముఖ్యమంత్రి సాధనగా జేఏసీ ఏర్పాటు చేసి అన్ని జిల్లాలలో మీటింగులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ,బొంగు ప్రసాద్ గౌడ్ ,వెంకటేష్ యాదవ్ ,రామారావు ,జగన్మోహన్ ముదిరాజ్ ,రామ్మోహన్ ,బహుజన నాయకుడు మధు,నరసింహ గౌడ్ ,సుధాకర్ ,సంపత్ ,వేణుగోపాల్ ,మహేష్ ,మహేందర్ యాదవ్ ,కుందేటి రవి ,రవి నాయక్ ,ప్రవీణ్ ,మహిళా నాయకులు శిరోమణి ,బీసీ నేత కిషోర్ ,రాజు నాయక్ భీమ్లా తదితరులు పాల్గొన్నారు.