డిపోర్టేషన్‌పై కేంద్రమంత్రి ప్రకటన..
రాజ్యసభలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక ప్రకటన చేశారు. అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడంపై జవాబు చెప్తూ అక్రమ వలసదారులకు సంకెళ్లు వేయడం అక్కడి ఫెడరల్ పాలసీ అన్నారు. అలాగే వారిని ఫుడ్ బ్రేక్‌లో సంకెళ్లు తొలగించారని పేర్కొన్నారు. వారికి ఆహారం, మెడిసిన్స్ అందించారన్నారు. ఇది మొదటిసారి కాదని 2009 నుండి ఇలా పంపుతున్నారని పేర్కొన్నారు. వలసదారులకోసం కొత్త చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. విదేశాలలో ఉపాధి కోసం సురక్షితమైన, క్రమబద్దమైన వలసలను ప్రోత్సహించేలా ఈ కొత్త చట్టంలో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. విదేశాలలోని భారత విద్యార్థుల సంక్షేమాన్ని ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. వలసదారులను అమానవీయంగా కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి తరలించారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

