కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు-రైతులకు తీపి కబురు
నేడు కేంద్ర కేబినెట్ సమావేశాలలో పంటల కనీస మద్దతు ధరల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు తీపి కబురునందించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పంటలపై కనీస మద్దతు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించారు. ధాన్యంపై 7 శాతం, పెసర్లపై 10.4 శాతాన్ని పెంచుతున్నట్లు తెలియజేశారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో పంటల మద్దతు ధరలు పెంచుతున్నారు. ఆహార, వినియాగదారుల శాఖామంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, రైతులను ఆదుకోవడానికి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. వ్యవసాయ ధరల కమీషన్ సూచనల ప్రకారం విడతల వారీగా సీజన్‌ను బట్టి ఈ ధరలు పెంచుతున్నట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మద్దతు ధరలు చాలా ఎక్కువగా పెంచుతున్నట్లు తెలిపారు. 23 రకాల పంటలకు ఖరీఫ్, రబీ పంటలకు గాను కనీస ధరలు నిర్ణయించినట్లు తెలిపారు. గోధుమ, ఆవ పంటలను రబీ సీజన్‌లో ముఖ్యపంటలుగా నిర్ణయించారు.

సాధారణ ధాన్యం ధరలను కనీస ధర క్వింటాలుకు 2,063 రూపాయల నుండి 2,183 రూపాయలకు పెంచింది. ఏ గ్రేడ్ ధాన్యాన్ని 2,063 నుండి 2,203 వరకూ పెంచారు. సజ్జలు 2,350 నుండి 2,500 లకు, రాగులు 3,578 నుండి 3,846 రూపాయలకు పెరిగాయి. కమదపలప 6,600 రూపాయల నుండి 7000 రూపాయలకు పెరిగాయి. పెసలు 7,755 నుండి 8,558 కి, మినుములు 6,600 రూపాయల నుండి 6,950 రూపాయలకు పెంచారు.

