జమిలికి కేంద్ర కేబినెట్ ఆమోదం
బీజెపి ప్రతిష్టాత్మక పొలిటికల్ ప్రాజెక్ట్ అయిన జమిలి ఎన్నికలకు సంబంధించి గురువారం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు బిల్లుకు పచ్చజెండా ఊపుతున్నట్లు మంత్రి వర్గం ప్రకటించింది.గతంలో జమిలి ఎన్నికల సిఫార్సు ను కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది.మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటి అందించిన జమిలి ఎన్నికల సిఫార్సులు గతంలోనే కేంద్రానికి అందాయి.ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంతా భావిస్తున్న తరుణంలో ఈ రోజు కేంద్ర కేబినెట్ బిల్లుకు ఆమోదం తెలపడం తో ఇక జమిలి ఎన్నికలు షురూ అయ్యేలా కనిపిస్తున్నాయి.లోక్ సభలో బిల్లుకు ఆమోదం లభిస్తే ఇక రాజ్య సభ,రాష్ట్రపతి ఆమోదాలు మిగిలి ఉంటాయి.ఇవి రెండూ బీజెపి సులవైన అంశాలే అయినప్పటికీ దీనిపై జేపిసి(జాయింట్ పార్లమెంటరీ కమిటి) వేసి అఖిల పక్ష మద్దతు కోరతారా లేదా మూజు వాణి ఓటుతో క్లియర్ చేసుకుంటారా అనేది తేలాల్సి ఉంది.

