NationalNewsNews AlertTelangana

హైదరాబాదీ పరేషాన్‌.. వర్షం దెబ్బకు లబోదిబో

మనుషుల ప్రవర్తన, ఆలోచనలు ఊహించడం కష్టం. ఊహకు అందనంత వేగంగా ఆలోచనల్లో మార్పు వస్తుంటుంది. కానీ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుందంటే చెప్పాలంటే అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకసారి అమాంతంగా వర్షం కురిస్తే అంతలోనే ఎండా కాలమా అన్నట్టుగా ఉక్క పోస్తోంది. నగరంలో ఎప్పుడు వర్షం కురుస్తుందో, రోడ్లన్నీ ఎప్పుడు కాల్వలు కడతాయోనని జనం బెంబేలెత్తిపోతుంటే, మరోవైపు అమాంతంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో జనం లబోదిబోమంటున్నారు. మొత్తంగా మహానగరం హైదరాబాద్‌లో ఉదయం ఎండ, అంతలోనే నేనున్నానంటూ వర్షం పలకరిస్తోంది. వర్షం కారణంగా రోడ్లన్నీ బురద బురదతో నగర పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉదయం ఆఫీసులకు వెళ్లేవారు, సాయంత్రం ఇళ్లకు వెళ్లేవారు వర్రీ అవుతున్నారు.