పాపం…కుంభమేళాకొచ్చి దొరికిపోయాడు
మొన్న పుష్ప ఓ స్మగ్లర్‌ని పట్టిస్తే..నేడు కుంభమేళా మరో స్మగ్లర్‌ని పట్టించింది. కొన్ని నెలలుగా పోలీసుల కళ్లుగప్పి బీహార్ స్మగ్లర్ కుంభమేళాలో పట్టుబడ్డాడు. ఆ లిక్కర్ స్మగ్లర్‌ను పట్టుకునేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తుండగా.. అతను మాత్రం మహా కుంభమేళాకు వెళ్లి ఎంచక్కా పుణ్యస్నానం చేశాడు. అయితే అక్కడ పట్టుబడటంతో పోలీసులు ఆ లిక్కర్ స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. ఏడాదిన్నర క్రితం నకిలీ మద్యం తరలిస్తుండగా పట్టుబడిన ఆ స్మగ్లర్.. అప్పటి నుంచి పరారీలో ఉండగా.. ఇన్ని రోజుల తర్వాత మహా కుంభమేళాలో పట్టుబడటం గమనార్హం. మద్యం స్మగ్లింగ్ కేసులో ఏడాదిన్నరగా పరారీలో ఉండి పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఆ స్మగ్లర్ ఎట్టకేలకు ప్రయాగ్‌రాజ్‌లో పట్టుబడ్డారు. అతడే రాజస్థాన్‌కు చెందిన ప్రవేశ్ యాదవ్.అల్వార్ జిల్లాకు చెందిన ఈ నిందితుడు .. చాలా ఏళ్లుగా మద్యపాన నిషేధం అమలులో ఉన్న బీహార్‌కు అక్రమంగా మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో పుణ్య స్నానం చేసేందుకు వచ్చిన ప్రవేశ్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు బదోయి ఎస్పీ అభిమన్యు మాంగలిక్ వెల్లడించారు.

