అన్‌డాకింగ్ సక్సెస్.. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ భూమికి ప్రయాణం
అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తీసుకురావడానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ విజయవంతంగా అన్ డాకింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుంది. వీరిద్దరూ మరి కొన్ని గంటల్లో భూమ్మీదకు రానున్నారు. ఈ మొత్తం ప్రక్రియను నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. భూ వాతావరణంలోకి ప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలనలు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2.41కి చేపడతారు. వీరిద్దరితో పాటు వెళ్లిన వారిలో మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమ్మీదకు తిరిగి వస్తున్నారు. మరో ఇద్దరు అంతరిక్ష కేంద్రంలో 150 రోజుల పాటు పనిచేయనున్నారు. వారం రోజుల ప్రయోగం కోసం వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు తొమ్మిది నెలల పాటు అనుకోని పరిస్థితులలో అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవాల్సి వచ్చింది.