మెగా మేనల్లుడి పెళ్లికి మామయ్యలు బ్రేక్..
మెగా ఫ్యామిలీలో మేనల్లుడి పెళ్లి విషయం అత్యంత ప్రాధాన్యంగా మారింది. మీడియాలో వస్తున్న రూమర్లకు చెక్ చెప్పే విధంగా సాయిధరమ్ తేజ్ పెళ్లికి పక్కాగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే మేనల్లుడి పెళ్లి వ్యవహారంపై కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని మామయ్యలు ఓ నిర్ణయం తీసుకున్నారనే విషయం ఆసక్తిని రేపింది. సాయి ధరమ్ తేజ్ పెళ్లిపై వస్తున్న వార్తలు, మెగా ఫ్యామిలీ ఖండించిన వివరాల్లోకి వెళితే..
సాయిధరమ్ తేజ్ కొద్దికాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. విరూపాక్ష బ్లాక్ బస్టర్ సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. యాక్సిడెంట్ తర్వాత నాకు కొన్ని హెల్త్ సమస్యలు ఏర్పడ్డాయి. వాటి కోసం నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని అనుకొంటున్నాను. కాబట్టి కొంత గ్యాప్ తర్వాత సినిమాలు చేస్తాను అని అన్నారు.
అయితే వివాహం జరిపించే విషయంలో మెగా ఫ్యామిలీ ఓ నిర్ణయం తీసుకున్నది. అయితే ప్రస్తుతం చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇద్దరు తమ తమ ప్రొఫెషన్స్‌లో బిజీగా ఉన్నారు. కాబట్టి వారి వెసులుబాటును చూసుకొని ముహూర్తాలు పెట్టాలని ఫ్యామిలీ నిర్ణయం తీసుకొన్నట్టు మీడియా వర్గాల్లో ప్రచారం.. అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పాటు సమయంలో మేనమామ కూడా సమయం వెచ్చించలేని పరిస్థితుల్లో పెళ్లి నిర్ణయాన్ని మేనల్లుడు కొంత వాయిదా వేసుకొన్నారని తెలుస్తున్నది. ఆయన పెళ్లి గురించి ఏదైనా విషయం ఉంటే అధికారికంగా వెల్లడిస్తాం. అంతేకానీ అవాస్తవాలను ప్రచారం చేయవద్దని వెల్లడించారు. సాయిధరమ్ తేజ్‌పై రూమర్లు రాయవద్దని సూచించారు.
ఇదిలా ఉండగా, సాయిధరమ్ తేజ్ ఓ భారీ ప్రాజెక్టుకు సిద్దమవుతున్నారు. హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి సుమారుగా 120 కోట్ల రూపాయలతో నిర్మించే పాన్ ఇండియా సినిమాలో ఆయన నటించనున్నారు. ఆగస్టులో ప్రారంభమయ్యే ఈ సినిమా షూట్ సుమారుగా 1 సంవత్సరంపాటు ప్రొడక్షన్‌లో ఉంటుందని నిర్మాతలు ఇటీవల చెప్పారు. వచ్చే ఏడాది అంటే.. 2025లో మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

