కొత్త అల్లుడిపై మామ అఘాయిత్యం..
మహారాష్ట్రలోనే ఠాణె జిల్లాలో కొత్త అల్లుడిపై మామ యాసిడ్ దాడి చేసిన ఘటన జరిగింది. హనీమూన్ కోసం ఎక్కడికెళ్లాలనే విషయంపై వచ్చిన గొడవలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. జకీ గులామ్ ముర్తజా ఖోటాల్(65) అనే వ్యక్తి కుమార్తెను అతీక్ అనే యువకునికిచ్చి వివాహం జరిపించాడు. అయితే హనీమూన్ కోసం తాము కశ్మీర్ వెళ్లాలనుకుంటున్నట్లు అతీక్ చెప్పగా, వద్దు విదేశాలలోని ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లమంటూ మొండిపట్టు పట్టారు గులామ్. ఈ విషయంపై ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో అతీక్ రాత్రి వేళ ఇంట్లోకి వెళ్తుంటే కారులో వేచి ఉన్న గులామ్ అల్లుడి ముఖంపైనా, శరీరంపైన యాసిడ్‌తో దాడికి పాల్పడ్డాడు. అనంతరం పరారీ అయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు పోలీసులు.