గాజాపై ఆందోళన..రెండ్రోజుల్లో 14 వేల మంది పిల్లలకు మృత్యుగండం..
గాజాలోని పిల్లలు, మహిళల పరిస్థితిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ చేస్తున్న భయంకర దాడులతో గాజాలో నరకం అనుభవిస్తున్నారు సామాన్య ప్రజలు. గాజాను అన్నివైపులా చుట్టుముట్టిన ఇజ్రాయెల్ ఆహార పంపిణీకి కూడా కొద్ది మొత్తాన్నే అంగీకరిస్తోంది. దీనిపై యూఎన్‌వో స్పందించింది. అక్కడి 14 వేల మంది చిన్నారులను ఆకలిచావులకు గురిచేస్తారా? అంటూ మండిపడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 48 గంటల్లోనే ఆ చిన్నారులు మరణించే అవకాశం ఉందంటూ హెచ్చరించింది. ఇజ్రాయెల్ తీరుపై బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, తీవ్రంగా ఖండించాయి. గాజాకు మానవతా సాయం అందివ్వకపోతే ఉమ్మడిగా ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించాయి. పోషకాహారంతో కూడిన 100 ట్రక్కుల సహాయాన్ని గాజాలోకి అనుమతించి చిన్నారుల ప్రాణాలు కాపాడాలని కోరింది. మరోపక్క ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాను ఇజ్రాయెల్‌లో భాగంగా పరిగణిస్తామని, హమాస్ ఆయుధాలు వదిలి గాజా విడిచిపోవాలని ఖతార్ చర్చలలో హెచ్చరికలు చేశారు.