అమ్మో .. స్వైన్ ఫ్లూ
నారాయణపేట జిల్లా మక్తల్‌లో నలుగురికి స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు వైద్యులు గుర్తించారు.మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం వారిని హైద్రాబాద్ లోని ఆసుపత్రికి తరలించగా అందులో ఒకరికి స్వైన్ ఫ్లూ సోకినట్లు గుర్తించి వెంటనే చికిత్స అందిస్తున్నారు.మిగిలిన ముగ్గురికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా మక్తల్ లో వ్యాధి విస్తరణా నివారణ చర్యలు చేపట్టారు.ప్రజారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరి ఆదేశాలు జారీ చేశారు.