దున్నపోతు కోసం రెండు గ్రామాల కొట్లాట
అనంతపురం జిల్లాలో ఒక దున్నపోతు కోసం రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. దీనితో కొట్లాట మొదలయి ఆ రెండు గ్రామాల ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. రెండు గ్రామాల పెద్దలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించే సోమవారం రావాలని పోలీసులు సూచించారు. కూడేరు మండలం ముద్దలాపురంలో ముత్యాలమ్మ, కదరగుంటలో బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా దేవర నిర్వహణకు గ్రామస్తులు పూనుకున్నారు. ఈ రెండు గ్రామాలలోనూ దేవరలో బలి ఇచ్చేందుకు రెండు దున్నపోతులు వదిలారు. ఈ రెండు దున్నపోతులు నాలుగేళ్లుగా సమీప గ్రామాలలో సంచరిస్తున్నాయి. ఈ నెల 22న దేవర కార్యక్రమం ఉండడంతో ఇటీవల గ్రామంలోకి వచ్చిన దున్నపోతును కదరకుంట గ్రామస్తులు కట్టేశారు. కానీ ఆ దున్నపోతు తమ గ్రామానికి చెందినదేనని ముద్దలాపురం గ్రామస్థులు అనుకుంటున్నారు. తమ దున్నపోతును వదిలేయాలంటూ వారిని కోరగా, కడదరకుంట గ్రామస్థులు ఒప్పుకోలేదు. దీనితో గొడవలు మొదలయ్యాయి.
BREAKING NEWS: అరెస్ట్ చేయడానికి కుట్ర పన్నారు

