2 తెలుగు రాష్ట్రాల్లో రెండు ఆత్మహత్యలు
తెలుగు రాష్ట్రాల్లో రెండు ఆత్మహత్యలు ఓకే రోజున చోటు చేసుకున్నాయి. ఏపిలోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం ఈదురాపల్లిలో ఓ టీచర్ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.నవ్య అనే ఉపాధ్యాయురాలు గత కొంత కాలంగా టీచర్‌గా పనిచేస్తుంది.పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.అదేవిధంగా తెలంగాణాలోని సంగారెడ్డిలో కోత్లాపూర్‌లో ఉన్న జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఎవరో చంపారని తల్లిదండ్రులు,బంధువులు గురుకుల పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.రెండు ఘటనల మీద ఆయా రాష్ట్రాల పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

