ఈతకు వెళ్లి ఇద్దరు మృతి..ఒకరి పరిస్ధితి విషమం
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీ కోట మండలం కృష్ణాపురం పంచాయతీ మోట్లపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ముగ్గురు పిల్లలు సరదాగా చెరువు వద్దకు ఈత కొట్టడానికి వెళ్లి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుని హాస్పిటల్ తరలించారు ప్రస్తుతం ఆ బాలుడు పరిస్థితి కూడా విషమంగా ఉందని అన్నారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసు దర్యాప్తులో తెలియాల్చి ఉంది.