వివేకా హత్య కేసులో ట్విస్ట్, నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు
వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. మే 5 లోగా సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. వివేకా హత్య కేసు కీలక దశలో ఉందని సీబీఐ కోర్టుకు తెలపడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది. నిందితుడు ఎర్ర గంగిరెడ్డి సాక్షులను బెదిరించారని సీబీఐ కోర్టుకు వివరించింది. గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను భయపెడుతున్నారని తెలిపింది. దర్యాప్తు కొలిక్కి వస్తున్న సమయంలో గంగిరెడ్డి బయట ఉంటే విచారణపై ప్రభావం పడుతోందని సీబీఐ కోర్టులో వాదించింది. సీబీఐ వాదనతో సునీత తరపు న్యాయవాదులు ఏకీభవించారు.
