ఈ రోజు రాత్రి 8.30 నుండి 9.30 వరకు లైట్లు ఆఫ్ చేయండి
ఇవాళ దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహించనున్నారు. ఈ రోజు రాత్రి 8.30 గంటల నుండి 9.30 గంటల వరకు గంటపాటు అందరూ లైట్లు ఆఫ్ చేయాలని పర్యావరణ శాఖ కోరింది. వాతావరణంలో మార్పులు, జీవ వైవిధ్యానికి జరుగుతున్న నష్టాన్ని కొంతైనా తగ్గించేందుకు ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. కాగా ఏటా ఒకసారి దేశవ్యాప్తంగా ఎర్త్ అవర్ నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో ఈ కార్యక్రమం పాటిస్తున్నారు.