TSPSC కీలక నిర్ణయం
TSPSC ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. TSPSCలో పని చేస్తున్న ఉద్యోగులు, ఇతర సిబ్బంది తమ సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్‌లను కార్యాలయం లోపలికి తీసుకురాకుండా నిషేధం విధించారు. మార్చి 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని నిర్ణయించారు. అభ్యర్థుల ఫిర్యాదు కోసం ప్రత్యేకమైన ఆన్‌లైన్ వ్యవస్థను బలోపేతం చేసేలా పలు నిర్ణయాలు తీసుకున్నారు. పేపర్ల లీకేజీలపై సిట్ అధికారులు ఇచ్చిన నివేదికపైనా కూడా కమిషన్ సభ్యులు చర్చలు జరిపారు.

