టీఎస్పీఎస్ పేపర్ లీక్ కేసు.. 8 మంది నిందితులకు బెయిల్
టీఎస్పీఎస్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 8 మంది నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50 వేల పూచీకత్తుతో 8 మందికి బెయిల్ మంజూరు చేస్తూ.. పోలీసుల విచారణకు సహకరించాలని నిందితులను ఆదేశించింది. నిర్దేశించిన తేదీల్లో సిట్ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక.. టీఎస్పీఎస్ పేపర్ లీక్ కేసులో ఐదుగురు నిందితులు రేణుక, రాజేశ్వర్, ఢాక్యానాయక్, గోపాల్, నీలేష్‌లను కస్టడీకి ఇవ్వాలని ఈడీ శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. నిందితులు తరుఫు న్యాయవాదులు ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయనున్నారు. అయితే గతంలో వీరి కస్టడీ కోరుతూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.

