Home Page SliderNational

నీట్ పరీక్ష రీటెస్ట్‌లో బయటపడిన నిజం

నీట్ యూజీ 2024 పరీక్షలో అక్రమాలు జరిగాయని, గ్రేస్ మార్కులు పొందిన అభ్యర్థులకు రీటెస్ట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. నేడు నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో ఒక నిజం వెల్లడయ్యింది. గతంలో హర్యానాలో ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురికి ఫస్ట్ ర్యాంక్ రావడం, 720 మార్కులకి, 720 మార్కులు వచ్చాయి. కానీ రీటెస్ట్ అనంతరం ఫలితాలలో గణనీయమైన మార్పు కనిపించింది. కేవలం ఒక్క విద్యార్థికి మాత్రమే 682 మార్కులు వచ్చాయి. మిగిలిన వారికి 600 మార్కలు దాటాయని ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ పరీక్ష తర్వాత అందరి ర్యాంకులలో మార్పులు వచ్చాయి. గతంలో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపగా, వారందరికీ రీటెస్టు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ రీటెస్టుకు కేవలం 813 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ నీట్ పేపర్ లీకేజ్ విషయంలో ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. సుప్రీం కోర్టులో కేసు విచారణ కూడా కొనసాగుతోంది. అనుమానిత పరీక్ష కేంద్రాలలో పరీక్ష రాసిన విద్యార్థుల ఫలితాలు తెలుసుకోవడం కోసం, కేంద్రాల వారీగా ఫలితాలు అందించాలని కోర్టు ఎన్టీఏను ఆదేశించింది. ఈ ఫలితాలను విద్యార్థుల గుర్తింపు బయటపడకుండా అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది.