ట్రంప్ వార్నింగ్స్..దారుణంగా పడిపోయిన ఇరాన్ కరెన్సీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయాలతో ప్రపంచదేశాలన్నింటినీ ప్రభావితం చేస్తున్నారు. ఇటీవల అణ్వాయుధ తయారీకి సిద్ధమవుతున్న ఇరాన్‌పై అధిక ఒత్తిడిని తీసుకొచ్చేలా కఠిన విధానాలను అమలుచేయాలని ట్రంప్ నిర్ణయించారు. ఈ చట్టం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనితో ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు చావుదెబ్బ తగిలినట్లయ్యింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారీగా ఇరాన్ కరెన్సీ దిగజారిపోయింది. ఒక అమెరికన్ డాలర్‌కు 8,50,000 ఇరానీయన్ రియాల్స్‌కు పతనమయిపోయింది. 2015లో అమెరికాతో ఇరాన్ అణు ఒప్పందం సమయంలో డాలర్‌కు 32 వేల రియాల్స్ ఉండగా, గత పదేళ్లుగా భారీగా పతనమవుతోంది. తాజాగా మరింత దిగజారి 8.5 లక్షల రియాల్స్‌కు పడిపోయింది.