crimeHome Page SliderInternationalPolitics

హమాస్‌కు ట్రంప్ వార్నింగ్

అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయాలంటూ హమాస్ మిలిటెంట్ సంస్థకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనవరి 20న తాను అధ్యక్ష బాద్యతలు చేపట్టేలోపు బందీలను విడుదల చేయకుంటే వారికి నరకం చూపిస్తానని హెచ్చరించారు. అమెరికాకు చెందిన పౌరులు సైతం అక్కడ బందీలుగా ఉన్నారని, బందీల తల్లిదండ్రులు తన దగ్గరకు వచ్చి వాపోయారని పేర్కొన్నారు. తాను బాధ్యతలు తీసుకునేలోపు వారు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు. 2023లో ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయడంతో మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ దాడులలో సుమారు 1200 మంది మరణించారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. గాజా ప్రాంతం అంతా స్మశానంగా మారింది. 251 మందిని హమాస్ బంధించింది. కొందరిని తాత్కాలిక కాల్పుల విరమణ సందర్భంగా విడుదల చేయగా, ఇంకా 100 మందికి పైగా హమాస్ చెరలోనే ఉన్నారు. వారిలో కూడా 50 మంది పైగా మరణించి ఉంటారని ఇజ్రాయెల్ భావిస్తోంది.