ట్రంప్ ప్రమాణ స్వీకారం అక్కడ కాదు
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరి 20 సోమవారం నాడు అమెరికా 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికోసం ప్రమాణ స్వీకార కమిటీ వాషింగ్టన్‌లో ఏర్పాట్లు చేసింది. కానీ అక్కడ తీవ్రమైన మంచు, రక్తం గడ్డకట్టే చలి పరిస్థితుల వల్ల అవుట్ డోర్‌లో కాకుండా యూఎస్ క్యాపిటల్‌లో చేస్తున్నట్లు ట్రంప్ తన ట్రూత్ అనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇలా 45 ఏళ్ల క్రిందట 1985లో అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ కూడా రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, బరాక్ ఒబామా కూడా హాజరు కానున్నారు. భారత్ నుండి విదేశాంగ మంత్రి జై శంకర్, చైనా నుండి ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు.

