మెక్సికో పేరు మార్చిన ట్రంప్..
గూగుల్ మ్యాప్స్ కూడా ట్రంప్ బాట పట్టింది. ఇటీవల గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని చెప్పారు నూతన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయన మాట ప్రకారం అదే తరహాలో గూగుల్ మ్యాప్స్‌లో కూడా మార్పులు చేసింది గూగుల్. మెక్సికో యూజర్లకు మాత్రం గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా, ఇతర దేశాలకు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా చూపిస్తోంది. అధికారికంగా అప్‌డేట్లు వచ్చినప్పుడు పూర్తి మార్పులు చేస్తామని పేర్కొంది ఈ టెక్ కంపెనీ.

