Andhra PradeshHome Page Slider

వైసీపీని జనసేనతో పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్

ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో అధికార వైసీపీ పార్టీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికలలో 151 సీట్లు గెలుచుకున్న వైసీపీ పార్టీ ప్రస్తుతం 14 స్థానాలలోనే ఆధిక్యతలో కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు 160 అసెంబ్లీ స్థానాలకు పైగా ముందంజలో కొనసాగుతున్నారు. 21 స్థానాలలో పోటీకి దిగిన జనసేన 20 స్థానాలలో ముందంజలో ఉండడంతో వైసీపీ 175 స్థానాలలో పోటీ చేసిన కేవలం 14 స్థానాలలో ఆధిక్యతలో కొనసాగడంతో జనసేనతో పోటీ పడడానికి కూడా వైసీపీ కష్టపడుతోందంటూ ట్రోల్స్ వస్తున్నాయి.