పద్మ అవార్డుల వేళ రాజమౌళిపై ట్రోలింగ్..
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో ఏడుగురు అవార్డు గ్రహీతలు తెలుగువారు ఉన్నారు. వైద్య విభాగంలో డాక్టర్ దువ్వూరు నాగేశ్వర రెడ్డి- పద్మవిభూషణ్, కళల విభాగంలో నందమూరి బాలకృష్ణ – పద్మభూషణ్, మాడుగుల నాగఫణిశర్మ, మందకృష్ణ మాదిగ, కేఎల్ కృష్ణ, మిరియాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పంచముఖిలకు పద్మశ్రీలు వరించాయి. వీరిని అభినందిస్తూ దర్శకుడు రాజమౌళి సోషల్ మీడియా వేదికగా వారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. పద్మ పురస్కారం వచ్చిన తెలుగువారికి, పద్మ భూషణ్‌కు ఎంపికైన నందమూరి బాలకృష్ణగారికి అభినందనలు. ఇతర భారతీయ విజేతలకు కూడా శుభాకాంక్షలు అంటూ ప్రశంసించారు. అయితే ఈ ట్వీట్‌పై బాలీవుడ్ ప్రేక్షకులు కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన తెలుగువారికి మాత్రమే ప్రశంసలు తెలియజేశారని, దక్షిణాది, ఉత్తరాదివారిని విడదీశారని, రాజమౌళి చిత్రాలను ఎందుకు ఉత్తరాది వారు ఆదరిస్తున్నారో.. అంటూ విమర్శిస్తున్నారు. దీనితో రాజమౌళి అభిమానులు వారికి తగిన జవాబు చెప్పారు. ఆయన ఎన్నడూ ఇలాంటి తేడాలు చూడరని, తన మాతృభాషకు చెందిన వారికి అవార్డులు వస్తే సంతోషపడ్డారంతే.. అంటూ సెటైర్లు వేశారు.


 
							 
							