మైనర్ల ట్రిపుల్ రైడింగ్..ముగ్గురు మృతి
హైదరాబాద్‌లోని ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై విషాద సంఘటన చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి వద్ద ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై ముగ్గురు మైనర్లు వెళ్తున్న ద్విచక్రవాహనం ఎలక్ట్రిక్ పోల్‌ను ఢీకొట్టి..డివైడర్ వైపుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరు బహదూర్‌పురాకు చెందినవారుగా గుర్తించారు. బహదూర్‌పురా నుండి ఆరాంఘర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మైనర్లు కావడం, ట్రిపుల్ డ్రైవింగ్, అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

