పద్మవిభూషణ్ చిరంజీవికి సత్కారం
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆహా సంస్థలు సంయుక్తంగా శుక్రవారం హైదరాబాద్‌లో సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్‌ని నిర్వహించాయి. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ప్రముఖ కథానాయకుడు చిరంజీవి హాజరయ్యారు. పద్మవిభూషణ్ గౌరవ పురస్కారం పొందిన సందర్భంగా చిరంజీవిని ఈ వేదికపై సత్కరించారు. ఈ కార్యక్రమంలో మణిశర్మ, తనికెళ్ల భరణి, టీజీ విశ్వప్రసాద్, మురళీమోహన్, అల్లు అరవింద్, కె.ఎస్.రామారావుతో పాటు పలు భాషలకి చెందిన సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

