మన్మోహన్‌కు అభినందనల నివాళి
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో దివంగత మాజీ ప్రధానమంత్రి హర్షణీయ నివాళులు అందుకున్నారు.సభలో సీఎం రేవంత్ , కేటిఆర్,బీజెపి లీడర్స్ సహా అంతా ఆయనకు అభినందనలతో నివాళులు అర్పించారు.ఆయన సేవల్ని స్మరించుకుంటూ కొనియాడారు. నిర్మాణాత్మక సంస్కరణలకు మన్మోహన్ ఆజ్యం పోశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం మన్మోహన్ హయాంలోనే జరిగిందని కేటిఆర్ పేర్కొన్నారు.అయితే మన్మోహన్ కు లభిస్తున్న గౌరవం తెలంగాణ బిడ్డ అయిన మాజీ దివంగత ప్రధానమంత్రి పివి నరసింహారావుకి దక్కడం లేదన్నారు.ఢిల్లీలో అందరికీ ఘాట్స్(మెమోరియల్స్) ఉన్నాయని కానీ ఒక్క పివి నరసింహారావుకే లేకుండా పోయిందన్నారు.దీనిపై తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కేటిఆర్ చురకలంటించారు.

