crimeHome Page SliderInternationalPolitics

హష్‌మనీ కేసులో ట్రంప్‌కు ఉచ్చు..

అమెరికా అధ్యక్షుడైనా న్యాయం ముందు సమానమే అని తేల్చింది న్యూయార్క్ న్యాయస్థానం. కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నమోదైన పోర్న్ స్టార్కకు హష్‌ మనీ కేసును కొట్టివేయడానికి నిరాకరించింది. పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్‌తో ట్రంప్ ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి.  2016 ఎన్నికల సమయంలో ఆమె ఈ విషయంలో నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ హష్ మనీ ఇప్పించారని సమాచారం.  న్యాయవాది ద్వారా 1.30 లక్షల డాలర్ల హష్ మనీని ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుండి ఇచ్చారని, దానికోసం రికార్డులు తారుమారు చేశారని అభియోగం. దీనిపై విచారణ గతంలోనే ముగిసింది. స్టార్మీ డానియల్స్ కూడా ఇదంతా నిజమేనని అంగీకరించారు. దీనితో ఈ కేసులో అధ్యక్షుడైనా కూడా రక్షణ ఉండదని కోర్టు పేర్కొంది. కేవలం అధికారిక చర్యలకు మాత్రమే అధ్యక్షులకు రక్షణ ఉంటుందని, అనధికార ప్రవర్తన విషయంలో రక్షణ వర్తించదని స్పష్టం చేసింది. దీనితో క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటూ వైట్‌హౌస్‌లోకి ప్రవేశించే తొలి అధ్యక్షునిగా ట్రంప్ నిలుస్తారు.