రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ట్రాన్స్ జెండర్సను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులలో చేర్చుకుంది. ఇటీవల వారికి ట్రైనింగ్ పూర్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతోనే తమకు ఉద్యోగాలు వచ్చాయని చాలా సంతోషం వ్యక్తం చేస్తూ సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఉద్యోగాలకు ఎంపికైనవారు సికింద్రాబాద్ మెట్టుగూడలోని సిగ్నల్ వద్ద వాహనదారులను నియంత్రిస్తున్నారు.