Breaking NewscrimeHome Page SliderTelangana

నేటి నుంచి కొత్త అవ‌తారంలో …ట్రాన్స్ జెండ‌ర్స్‌!

ట్రాన్స్ జెండ‌ర్స్ కాస్త‌…ట్రాఫిక్ జెండ‌ర్స్‌గా మారిపోయారు.కృషితో నాస్తి దుర్భిక్ష్యం అన్న చందాన పాత వృత్తి ని పాతేసి పోలీస్ అవ‌తారం ఎత్త‌నున్నారు.దీని కోసం అహోరాత్రాలు క‌ష్టించి ప‌నిచేశారు. ఖాకీ డ్రెస్ వేసుకోవాల‌న్న వారి క‌ల నేటి నుంచి కార్య‌రూపం దాల్చ‌నుంది. అవ‌మానాలు,హేళ‌న‌ల‌కు గురైన వారు నేటి నుంచి శాల్యూట్ చేయ‌నున్నారు. హైదరాబాద్లో ఇవాల్టి నుంచి 39 మంది ట్రాన్స్ జెండర్లు ట్రాఫిక్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించనున్నారు. వివిధ జిల్లాలకు చెందిన 44 మంది ట్రాన్స్ జెండర్లు పోలీసు శిక్ష‌ణ తీసుకున్నారు. 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులు వీరంద‌రికి ట్రైనింగ్ ఇచ్చారు. డ్యూటీలో క్రమశిక్షణ, పనితీరుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఈ సంద‌ర్భంగా అక్క‌డ‌కు విచ్చేసి సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.