Home Page SliderTelangana

ఐఏఎస్ ల బదిలీలు

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ లు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న యోగితా రాణా విద్యాశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శిగా ఉన్న సురేంద్ర మోహన్ రవాణా శాఖ కమిషనర్ గా బదిలీ అయ్యారు. అలాగే మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శిగా ఎన్. శ్రీధర్ నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.