ఉద్యోగుల కొరతతో రద్దయిన రైళ్లు..
ఏపీలోని గుంటూర్ రైల్వే డివిజన్‌లో ఉద్యోగుల కొరత ఏర్పడింది. దీనితో కొన్ని రైళ్లను రద్దు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 4న జరిగే రైల్వే గ్రూప్ బి పరీక్షకు ఉద్యోగులు హాజరవుతుండడం వల్ల వారు విధులకు హాజరు కాలేదు. దీనితో కొన్ని పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 3 నుండి 5 వరకూ విజయవాడ-గుంటూరు , గుంటూరు -మాచర్ల, నడికుడి-మాచర్ల, కాచిగూడ-నడికుడి ప్యాసింజర్ రైళ్ళను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే.

