accidentHome Page SliderInternationalNews Alert

బోల్తా పడిన రైలు..ఏడుగురు మృతి

రష్యాలోని క్రస్క్‌లో భారీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున రైలు వంతెన కూలిపోయింది. గూడ్స్ రైలు వెళ్తుండగా, రైలు వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఉక్రెయిన్ సరిహద్దులకు దగ్గరగా ఉండడం గమనార్హం. రష్యాలోని బ్రయాన్స్క్‌లో శనివారమే ఒక పాసింజర్ రైలు కూడా వంతెన కూలి బోల్తాపడింది. ఈ ఘటన జరిగి ఒక రోజు కూడా జరగకముందే ఆదివారం మరో రైలు వంతెన కూలిపోవడంతో ప్రజలు భయబ్రాంతులవుతున్నారు. బ్రియాన్స్క్ ప్రమాదంలో డ్రైవర్‌తో సహా ఏడుగురు మృతి చెందగా, 70 మంది గాయపడ్డారు. ఈ రైలు మాస్కో నుండి కిల్‌మోవ్ వెళ్తున్నట్లు సమాచారం.