అయోధ్య శ్రీరామాలయంలో విషాదం..
యూపీలోని అయోధ్య శ్రీరామ జన్మభూమిలో విషాదం చోటు చేసుకుంది. శ్రీ రామ జన్మభూమి ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్(87) అనారోగ్యంతో కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం లక్నోలోని ఎస్‌జీపీటీలో చేర్చారు. డయాబెటిస్, అధికరక్తపోటుతో బాధపడుతూ, ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన రామ జన్మభూమి కోసం ఎంతగానో పరితపించారు. తన 20 ఏటలోనే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆయన రామాలయ పూజారిగా వ్యవహరించారు. అప్పటి పరిణామాలపై దాస్ దేశవ్యాప్తంగా మీడియాకు సమాచారం అందించేవారు.

